పుట్టపర్తి టౌన్: స్థానిక శిరసాని హిల్స్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 15వ తేదీ నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పరేడ్‌తోపాటు అన్ని కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం స్థానిక పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బంది నిర్వహిస్తున్న పరేడ్‌ను ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రమశిక్షణ, అంకితా భావంతో పనిచేస్తే తప్పక గుర్తింపు వస్తుందన్నారు. విధి నిర్వహణలో రాజీ పడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ సారించి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలన్నారు. ఎస్కార్ట్ డ్యూటీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులకు సంబంధించి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలుంటే నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు మహేష్, వలి, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, ప్రసాద్, కృష్ణానాయక్‌తోపాటు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్ సూచన


