చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి. అర్హులైన అభ్యర్థుల ఐడీలు ఎలా మాయమయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థులకు రాని ఉద్యోగం జాబితాలో తర్వాత ఉన్న వారికి ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలి. నీట్‌లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. అర్హులకు న్యాయం జరిగేలా డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ చేయించాలి.
– ఉషశ్రీచరణ్, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షురాలు


