చంద్రబాబు సర్కార్‌పై అన్ని వర్గాల్లో అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌పై అన్ని వర్గాల్లో అసంతృప్తి

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

మడకశిర: చంద్రబాబు సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ విమర్శించారు. ఆమె మంగళవారం మడకశిరకు విచ్చేశారు. ఈ సందర్భంగా వాల్మీకీ సర్కిల్‌లో పార్టీ మండల కన్వీనర్‌ శ్రీరాములు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, రాష్ట్ర విభాగం రైతు కార్యదర్శి రామిరెడ్డి, పట్టణ కన్వీనర్‌ ఓంకుమార్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ధను, పట్టణ పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు రఘునందన్‌, రైతు విభాగం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, బీఎల్‌ఏ నరసింహమూర్తి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్‌ జగన్‌ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, 2029 ఎన్నికల్లో జగన్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగే రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు. అలాగే, 10వ తేదీన జరిగే నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement