పర్యాటక కేంద్రం.. ఘోరం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రం.. ఘోరం

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

జఠాయువు రోడ్డులో పడేసిన వ్యర్థ పదార్థాలు

ఆలయం వెనుక భాగంలో చెత్తాచెదారం

లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయానికి రోజూ అనేక మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ప్రతి ఆది, శనివారాల్లో వేలాది మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. అలాంటి పర్యాటక కేంద్రంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పర్యాటకులు, భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రస్వామి దేవాలయం తూర్పు ద్వారం నుంచి జఠాయువు పక్షి విగ్రహానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చెత్తతో పాటు మాంసపు ముద్దలు, వ్యర్థ పదార్థాలు పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో పర్యాటకులు ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కంచిసముద్రం రోడ్డు, జఠాయువు పక్షి రోడ్డుకు ఇరువైపులా అపరిశుభ్రత తాండవిస్తోంది. అదేవిధంగా ఆలయం పడమర ద్వారంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో పర్యాటకులు భయకంపితులవుతున్నారు. పరిసరాలను శుభ్రం చేయాల్సిన పంచాయతీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తులు ఆహ్లాదం పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

కర్కశత్వానికి బలైన శిశువు

అనంతపురం సిటీ: నానమ్మ కర్కశత్వానికి చిన్నారి బలైంది. వివరాలు.. లేపాక్షి మండలం మామిడాకులపల్లికి చెందిన అశోక్‌కుమార్‌, పూజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్‌కుమార్‌ తల్లికి ఇష్టం లేదని తెలిసింది. అయినా కుమారుడి కోసమని ఆమె మౌనంగానే ఉంటూ వచ్చారు. గర్భం దాల్చిన పూజిత గత మే నెల 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్‌ తల్లి లోలోన రగిలిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలోనే శిశువుకు ఫిట్స్‌ వస్తుండడంతో తల్లిదండ్రులు జూలై 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండో అంతస్తులో ఉన్న పీడియాట్రిక్‌ వార్డులో వైద్యులు అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేస్తూ వచ్చారు. 28వ తేదీ వేకువజాము తల్లి నిద్రిస్తుండగా.. నానమ్మ ఆ శిశువును తీసుకెళ్లి రెండో అంతస్తుపై నుంచి కిందకు విసిరేసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. లేత శరీరం లోపల తీవ్రమైన గాయాలు ఉండడంతో శిశువు కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందింది.

లేపాక్షిలో తాండవిస్తున్న అపరిశుభ్రత

పర్యాటకులు, భక్తులకు తప్పని ఇక్కట్లు

పట్టించుకోని అధికారులు

కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement