ఆలయాలకు ‘నూతన’ శోభ
కదిరి టౌన్/లేపాక్షి: నూతన సంవత్సరం తొలిరోజు గురువారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివార్ల దర్శనానికి ఉదయం నుంచే ఆలయాల ఎదుట బారులు తీరారు. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలో వేచి ఉన్న భక్తులు నమో నారసింహ అంటూ శ్రీవారిని కీర్తించగా...శ్రీవారి నామంతో కదిరి పట్టణం ప్రతిధ్వనించింది. ఇక లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. నంది విగ్రహం, థీంపార్కు, జఠాయువు పక్షి విగ్రహం, ఏడుశిరస్సుల నాగేంద్రుని విగ్రహం, నాట్యమంపటం, కల్యాణ మంటపం తదితర ప్రాంతాలను తిలకించడానికి భక్తులు ఆసక్తి చూపారు.
ఆలయాలకు ‘నూతన’ శోభ
ఆలయాలకు ‘నూతన’ శోభ
ఆలయాలకు ‘నూతన’ శోభ


