వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే
పెనుకొండ రూరల్: అధికారంలో ఉన్నా...లేకపోయినా వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. అలాగే పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామన్నారు. స్థానిక వై జంక్షన్ సమీపంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రాంగణంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, ప్రజలు పుష్ప గుచ్ఛాలు, పూల హారాలతో జిల్లా అధ్యక్షురాలు దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గోరంట్లకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు యాపిల్ పండ్ల గజమాలతో ఉషశ్రీచరణ్ దంపతులను సత్కరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ శ్రేణులతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. జోహార్ వైఎస్సార్, జై జగన్, ఉషమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి ఉషశ్రీచరణ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రస్తుతం తాము అధికారంలో లేకపోయినా...కార్మికులు, కర్షకులకు, అన్నదాతలకు, విద్యార్థులకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, తిమ్మయ్య, నరసింహమూర్తి, గజేంద్ర, వెంకటేషులు, జెడ్పీటీసీలు అశోక్, పాలే జయరామ్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు వైశాలి జయ శంకర్‌రెడ్డి, నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గంపల రమణా రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు శేషాద్రి,సద్దాం, తయ్యూబ్, నాయకులు శ్రీరాములు, యాసిన్, కిష్టప్ప, గణప్ప, బాబు, కొండల రాయుడు, బోయ రాము, ఇస్లాపురం ఆంజనేయులు, గోవిందు,వ వెంకటేష్, లలిత్, ప్రవీణ్ రెడ్డి, సందీప్, టెంపో శీనా, రాజారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాగరాజు, శివయ్య, చెన్నకేశవులు, మల్లిరెడ్డి, కొండంపల్లి నాగిరెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణ యాదవ్, నారాయణ స్వామి పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే


