చంద్రన్నా.. రైతును ముంచావన్నా..!
కదిరి: ఓట్ల కోసం అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వంచించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలిచ్చారు. కానీ ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో సంబంధం లేకుండా ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేలు ‘అన్నదాత–సుఖీభవ’ పథకం ద్వారా ఇస్తానని చెప్పి మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండో ఏడాది కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిపి ఇస్తున్నారు. అది కూడా కొందరికే ఇచ్చాడు. కొందరికై తే కేంద్రం ఇచ్చే డబ్బు జమ అవుతోంది కానీ రాష్ట్రం ఇచ్చే డబ్బు జమ కావడం లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ అమలు చేసింది. ప్రీమియం మొత్తం జగన్ ప్రభుత్వమే చెల్లించేది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ పథకానికి మంగళం పాడారు. ఇప్పుడు రైతులే ప్రీమియం డబ్బు చెల్లించాలి. వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నా ఏ ఒక్క రైతుకూ బీమా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక ఎరువుల సంగతి చెప్పనక్కరలేదు. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు పడిన అగచాట్లు పత్రికల్లో కూడా చూశాం. ఇప్పుడు ‘రైతన్నా.. మీ కోసం’ అంటూ హడావుడి చేస్తుండటంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఏమి చేశారని జనం ముందుకు వస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొదటి ఏడాది ‘అన్నదాత–సుఖీభవ’ నగదు ఎగవేత
రెండో ఏడాది ఇచ్చింది కొంత మందికే..
ఉచిత పంటల బీమాకు పూర్తిగా మంగళం
‘రైతన్నా.. మీ కోసం’పై పెదవి విరుస్తున్న అన్నదాతలు
చంద్రన్నా.. రైతును ముంచావన్నా..!
చంద్రన్నా.. రైతును ముంచావన్నా..!


