అంతా మా ఇష్టం
విడపనకల్లు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండబండ వీరభద్రస్వామి దేవాలయంలో అంతా ఇష్టారాజ్యంగా మారింది. మంగళవారం ఏకంగా అర్చకులు గర్భగుడికి తాళం వేశారు. దీంతో భక్తులు ఆలయ ఆవరణంలోనే కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించి వెళ్లిపోయారు. ఆలయ కార్యకలాపాలు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ఆలయంలో పది మంది వరకూ అర్చకులు, 8 మంది దేవదాయ శాఖ సిబ్బంది ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నా అందుబాటులో ఉండటం లేదని భక్తులు వాపోతున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారిందని మండిపడుతున్నారు. ఆలయ ఈఓ ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉండబండ వీరభద్రేశ్వరాలయంలో సిబ్బంది, అర్చకుల ఇష్టారాజ్యం
గర్భగుడికి తాళం వేయడంపై సర్వత్రా విమర్శలు
అంతా మా ఇష్టం


