
నిర్మాణానికి సాయం చేయండి
‘‘
‘‘
నాకు పుట్టపర్తి సమీపంలోని బ్రాహ్మణపల్లి దగ్గర గత ప్రభుత్వం ఇంటి పట్టా ఇచ్చి.. పక్కాగృహం మంజూరు చేసింది. అయితే ఆర్థిక పరిస్థితులు బాగలేక పోవటంతో గత ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకోలేకపోయాను. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టా రద్దు చేయకుండా.. ఇంటి నిర్మాణానికి మరింత ఆర్థిక సహాయం చేయాలి.
– మేదర లక్ష్మి, పుట్టపర్తి
రద్దు.. సరికాదు
జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన పట్టాలను కూటమి ప్రభుత్వం రద్దుకు ఉపక్రమించాలనుకోవటం సరికాదు. ఆర్థిక స్తోమత లేక ఇంటి పనులు ప్రారంభించకుండా ఖాళీగా ఉన్న స్థలాలను రద్దు చేసే ఆలోచన మంచిది కాదు. వారికి మరొక అవకాశమిచ్చి మరింత ఆర్థిక సహాయం అందించి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పాటునందించాలి. పునాదుల వరకు నిర్మాణాలు చేసి బిల్లు కాకుండా ఉన్న వారికి ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించి నిర్మాణాల పూర్తికి సహకరించాలి.
– ఈఎస్ వెంకటేష్,
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

నిర్మాణానికి సాయం చేయండి