బత్తలపల్లి: భూ వివాదంలో ఇరు వర్గా ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు... ధర్మవరం రూరల్ మండలం తిమ్మనకొట్టాల గ్రామానికి చెందిన గోపాల్, ఆంజనేయులు, మంజు ఆదివారం మధ్యాహ్నం తమ పొలం వద్ద జేసీబీతో పనులు చేయిస్తున్న సమయంలో తిరుపాలు, శివయ్య, మునెయ్య అక్కడకు చేరుకుని ఆ భూమిలో తమకూ హక్కు ఉందంటూ కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో గోపాల్, ఆంజనేయులు, మంజుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గణేష్ ఉత్సవాలు
సజావుగా సాగేలా హామీ
హిందూపురం: వినాయక చవితి ఉత్సవాలను హిందూపురంలో 9 రోజుల పాటు సజావుగా నిర్వహిస్తామంటూ ఎస్పీ రత్నకు లిఖితపూర్వకంగా ఏపీ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హామినిచ్చారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందించాలని కోరారు.
‘సెక్టోరియల్’ అభ్యర్థుల మార్కులు బహిర్గతం చేయాలి : యూటీఎఫ్
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ పోస్టుల నియామకానికి ఎంపికై న అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలని కలెక్టర్‌ను యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చేతన్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్షలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ పోస్టులకు 120 మంది దరఖాస్తు చేసుకోగా 34 మందిని అర్హులుగా ఎంపిక చేస్తూ వారికి గురువారం బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. మార్కులు బహిర్గతం చేసి పారదర్శకంగా పోస్టులు భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇరువర్గాల ఘర్షణ
ఇరువర్గాల ఘర్షణ
ఇరువర్గాల ఘర్షణ