
రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
ధర్మవరం అర్బన్: తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు వేదికగా ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపి బంగారు పతకాలు దక్కించుకున్నారు. ఈ మేరకు జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల సోమేశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు. విద్యార్థులు మమత, అభిలాష్, యుగంధర్, రఘు, చేతన్‌గౌడ్, జస్వన్‌కుమార్, భాను కేశవ్ ప్రతిభ చూపి నాలుగు బంగారు పతకాలతో పాటు ద్వితీయ స్థానంలో ఇద్దరు, తృతీయ స్థానంలో నలుగురు, నాల్గో స్థానంలో ముగ్గురు, ఐదో స్థానంలో ముగ్గురు నిలిచారన్నారు.