
అర్ధరాత్రి వరకూ అవకాశం ఉంది
జిల్లాలో 11 బార్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ బార్‌లు తెరిచి ఉంచుతారు. లైసెన్స్ ఫీజు కూడా గతంలో కన్నా తగ్గింది. అలాగే లైసెన్స్ ఫీజు ఒకే సారి కాకుండా 6 సమాన వాయిదాల్లో చెల్లించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. –గోవిందు నాయక్,
జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్
తాగుడును ప్రోత్సహించడమే
కూటమి సర్కార్ చర్యలు చూస్తుంటే తాగుడును ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ బార్‌లు తెరుచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న ప్రభుత్వం మద్యం షాప్‌లు, బార్‌ల సంఖ్య తగ్గిస్తూ వస్తే ఈ ప్రభుత్వం పెంచుతూ వస్తోంది. ప్రజల ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి పట్టదు. మా ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగటున 30 శాతం, బీర్‌ల విక్రయాలు సగటున 57 శాతం తగ్గాయి. ఇప్పుడు సందు సందులోనూ మందు దొరుకుతోంది.
–ఉషశ్రీచరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ

అర్ధరాత్రి వరకూ అవకాశం ఉంది