
జగన్.. నీరాజనం
న్యూస్‌రీల్
జన తరంగం ఎగసింది. అభిమాన నేతను చూసి మురిసిపోయింది. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది. అడుగడుగునా నీరాజనం పలికింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నీ వెంటే అంటూ ముందుకు నడిచింది. ఏ శక్తీ తమను ఆపలేదంటూ స్పష్టం చేసింది. జగన్ నినాదాలతో మార్మోగించింది.
● అనంతలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘన స్వాగతం
● మాజీ ఎమ్మెల్యే విశ్వ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జననేత
● జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన జన సందోహం
● హెలిప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకు అడుగడుగునా నీరాజనం
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
22 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: వరుణుడు జిల్లాను వీడటం లేదు. తుపాను ప్రభావంతో గురువారం కూడా రోజంతా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ 22 మండలాల పరిధిలో వర్షం కురిసింది. జిల్లాలోని గుడిబండలో 18.4 మి.మీటర్లు, రొళ్ల 10.2, మడకశిర 6.6, ముదిగుబ్బ 5.8, గాండ్లపెంట 4.4, అగళి 4.2, తాడిమర్రి 3.4, కదిరిలో 3.2, నల్లచెరువు 3.2, బుక్కటప్నం2.8, నల్లమాడ 2.4, కొత్తచెరువు 2.4, గోరంట్లలో 2.4, పుట్టపర్తి, లేపాక్షి 2, తలుపుల, రొద్దం 1.8, ఎన్‌పీ కుంట, తనకల్లు 1.6, ధర్మవరం, సోమందేపల్లి 1.4, అమరాపురంమండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
‘అన్నదాత సుఖీభవ’ అందని రైతులు అర్జీలు ఇవ్వండి
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం ఈనెల 2వ తేదీన మంజూరు చేసిన అన్నదాత సుఖీభవ నిధులు జమ కాని రైతులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) సుబ్బారావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 625 మంది అర్జీలు అందజేశారన్నారు. అందులో 327 మందివి అనుమతించినట్లు పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అర్జీలను అందించాలని సూచించారు.
మట్టి వినాయకుడిని పూజిద్దాం
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: వినాయక చవితి నేపథ్యంలో అందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో పర్యావరణ అనుకూల వినాయక చవితిపై అవగాహన కల్పించారు. సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపకుందాం అనే పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విడుదల చేశారు. అభిషేక్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిషేధించారని, వాటి వలన హానికర రసాయనాల విడుదలతో నీరు కలుషితమవుతుందన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసే వారు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పీస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం కార్పొరేషన్: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి, సాయి రోహిత వివాహం గురువారం అనంతపురంలోని ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్‌లో జరిగింది. వీరి వివాహానికి హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జననేతను చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఉదయం 9 గంటలకే..
హెలీప్యాడ్ వద్దకు ఉదయం 9 గంటల నుంచే ప్రజలు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూశారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగగానే కేరింతలు కొట్టారు. ‘అన్న వచ్చాడు’ అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు ఈలలు, కేకలు వేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఇంద్రప్రస్థ జీఎంఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లి మండపానికి బయలు దేరిన జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. సంక్షేమ ప్రదాతను చూసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. రుద్రంపేట బ్రిడ్జి వద్ద, హెలీప్యాడ్ చుట్టుపక్కల భవనాలు, కల్యాణ మండపం చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కి అభివాదం చేశారు.
కిక్కిరిసిన కల్యాణ మండపం..
అభిమానులు, నాయకులు, ప్రజలతో కల్యాణ మండపం పరిసరాలు కిక్కిరిసిపోవడంతో వైఎస్ జగన్ లోపలికి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. జగనన్నతో కరచాలనం చేయడానికి అడుగడుగునా ప్రజలు ఉత్సాహం చూపారు. వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహితను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టర్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.
సాదర స్వాగతం..
హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్ (శింగనమల), మెట్టు గోవిందరెడ్డి(రాయదుర్గం), తలారి రంగయ్య (కళ్యాణదుర్గం),తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(రాప్తాడు), దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (పుట్టపర్తి),వై.వెంకటరామిరెడ్డి(గుంతకల్లు) కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), పెద్దారెడ్డి (తాడిపత్రి), మక్బుల్ (కదిరి), ఈరలక్కప్ప (మడకశిర), ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబ శివారెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మాజీ మంత్రులు ఆర్‌కే రోజా, శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, గుంటూరు వెస్ట్ సమన్వయకర్త ఫాతిమా నూరి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్‌తో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జగన్.. నీరాజనం

జగన్.. నీరాజనం

జగన్.. నీరాజనం

జగన్.. నీరాజనం

జగన్.. నీరాజనం