
జాతీయోద్యమంలో ‘కల్లూరు’ మార్క్
అనంత స్వాతంత్రోద్యమ చరిత్రలో కల్లూరు సుబ్బారావు ప్రత్యేక భూమికను పోషించారు. 1918లో గాంధీజీ పర్యటనలో ఇచ్చిన ఉపన్యాసానికి ప్రభావితమైన ఆయన... మెట్రిక్యులేషన్‌తో చదువుకు స్వస్తి పలికి జాతీయోద్యమంలో ప్రవేశించారు. జాతీయ స్థాయిలో జరిగిన అనేక సమావేశాలకు రాయలసీమ తరఫున హాజరైన ఏకై క ప్రతినిధిగా ఖ్యాతిగాంచారు. రాయలసీమ ప్రజా ప్రయోజనాల కోసం శ్రీబాగ్ ఒడంబడికలో సంతకం చేసిన వారిలో ముఖ్యులు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయనను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన విలువైన స్థలాన్ని లలిత కళలను ప్రోత్సహించేందుకు ఉదారంగా అందజేశారు. ప్రస్తుతం రూ.కోట్ల విలువ చేసే అనంతపురంలోని ఆ స్థలంలో నిర్మించిన లలిత కళాపరిషత్ ఎంతో మంది కళాకారులకు ఊతమిస్తోంది.