
పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
ప్రశాంతి నిలయం/పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకల్లో మంత్రి సవిత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. వివిద శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 282 మందికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు.
రిహార్సల్స్ పరిశీలన..
దేశభక్తి ఉట్టిపడేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న సూచించారు. స్థానిక పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక రిహార్సల్స్, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను కలెక్టర్, ఎస్పీతో పాటు జేసీ అభిషేక్‌కుమార్ గురువారం పరిశీలించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ, పోలీసుల కవాతు, గౌరవ వందనం, ఎన్‌సీసీ, హోంగార్డుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు , భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం