పేరుకే ఉచిత బస్సు | - | Sakshi
Sakshi News home page

పేరుకే ఉచిత బస్సు

Aug 15 2025 6:40 AM | Updated on Aug 15 2025 6:40 AM

పేరుకే ఉచిత బస్సు

పేరుకే ఉచిత బస్సు

పుట్టపర్తి టౌన్‌: సీ్త్రశక్తి పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లొచ్చు.. ఆంక్షలు లేకుండా అమలు అంటూ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు ఎన్నికల హామీల్లో ఊదరగొట్టారు. పథకం అమలుపై మాత్రం అప్పుడు.. ఇప్పుడూ అంటూ ఏడాదికి పైగానే కథలు చెప్పారు. అన్నివర్గాల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత బస్సు అంటూ నేటి నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఉచితానికి ఎన్నో ఆంక్షలు విధించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా 280 గ్రామాలకు బస్సులే లేకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులు 20 శాతం పెరిగే అవకాశం..

జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 2 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే 10 శాతం నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో 398 బస్సులు..

జిల్లాలో పుట్టపర్తి, హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర డిపోలు ఉన్నాయి. మెత్తం బస్సులు 398, అందులో ఎక్స్‌ప్రెస్‌లు 120, పల్లె వెలుగులు 224, డ్రైవర్లు 660, కండెక్టర్లు 560, ఇతర సిబ్బంది 380, లగ్జరీ బస్సులు 50, ఇంద్ర నాలుగు బస్సులున్నాయి. ఆరు బస్సు డిపోలు ఉన్నాయి. రోజూ ప్రయాణించే వారి సంఖ్య 2 లక్షలు, ఆర్టీసీకి రోజులు సగటు ఆదాయం రూ. 58 లక్షలు. పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అనుసరిస్తూ నిర్ణయం తీసుకోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్‌స్టాప్‌ బస్సుల్లో అనుమతులు లేకపోవంతో పెద్దగా ఒదిగేది ఏమి లేదంటున్నారు. కొత్తబస్సులు ఒక్కటి కూడా రాపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లాలో 13 లక్షల మంది మహిళలు..

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో 6 డిపోలలో 398 బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సాధారణ రోజుల్లో 392 బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తుంటాయి. రోజుకు సగటున 2 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉచిత బస్సులు అమలు చేస్తే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో దాదాపుగా 13 లక్షల మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో కేవలం 224 పల్లె వెలుగులు మాత్రం సేవలు అందిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

280 గ్రామాలకు బస్సులేవీ?..

జిల్లాలోని 280 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు ఆటోపై ప్రయాణం సాగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారని అంటున్నారు.

ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులే..

ఉచిత బస్సు నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా బస్సులు ఎక్కితే ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు సీట్లు దొరక్క ఇబ్బందులు పడక తప్పదని భావిస్తున్నారు.

కేవలం పల్లె వెలుగులు,

అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్‌ప్రెస్‌ల్లోనే ప్రయాణానికి అనుమతి

జిల్లా వ్యాప్తంగా

13 లక్షల మంది మహిళలు

కొర్రీలపై మహిళల అసంతృప్తి

280 గ్రామాలకు బస్సులే కరువు

ఇబ్బందుల్లేకుండా చూస్తాం

రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని బస్‌ సర్వీసులు కండీషన్‌లో ఉండేలా చూస్తాం. ప్రతి పల్లెకు బస్సులు పంపేవిధంగా చర్యలు తీసుకుంటాం. సాధారణ ప్రయాణికులకు కూడా ఇబ్బందుల లేకుండా చూస్తాం. గుర్తింపు కార్డు చూపిస్తే జీరో పేమెంట్‌ టికెట్‌తో ప్రయాణించవచ్చు. – మధుసూదన్‌, డీపీటీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement