
● జిల్లా అంతటా వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది. కొత్తచెరువు మండలంలో 76.4 మి.మీ, నల్లమాడలో 65.2, బుక్కపట్నం 59, పుట్టపర్తి 58.6, గాండ్లపెంట 54.4, ఓడీచెరువు 54.2, రొద్దం 51.6, తాడిమర్రి 47.2, సోమందే పల్లి 47, పెనుకొండ 44.6, తనకల్లు 44.6, నల్ల చెరువు 44.2, సీకేపల్లి 42.6, గుడిబండ 41.2, గోరంట్ల 38.2, బత్తలపల్లి 36.2, మడకశిర 35.6, ధర్మవరం 34.6, ముదిగుబ్బ 32.2, పరిగి 30.4, కదిరి 26.8, హిందూపురం 21.8, లేపాక్షి 18.2, రొళ్ల 15.4, తలుపుల 12.2, చిలమత్తూరు 12, అగళి 11.8, కనగానపల్లి 10.2, అమరాపురం 9.8, అమడగూరు 8.2, ఎన్‌పీ కుంట 3, రామగిరిలో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరుతోంది. తుపాను ప్రభావంతో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ‘చిత్రావతి’
ధర్మవరం రూరల్: పోతులనాగేపల్లి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పైతట్టు ప్రాంతంలో కురిసిన వర్షాలకు చిత్రావతి నదిలోకి భారీగా నీరు చేరుతోంది. నది ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.

● జిల్లా అంతటా వర్షం

● జిల్లా అంతటా వర్షం