డీఈఈ సెట్ నిర్వహణకు రెండు కేంద్రాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈ సెట్)–2025కు జిల్లాలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 2న మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు జరిగే పరీక్షలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా (చిన్మయానగర్, ప్రసన్నాయపల్లి పంచాయతీ), రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న ఎస్‌వీఐటీ కళాశాల కేంద్రాలుగా ఉంటాయన్నారు. https://apdeecet.apcfss.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. నిర్ణీత సమయానికి గంట ముందే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆధార్‌కార్డ్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని సూచించారు.


