● 11 మందికి గాయాలు
పెద్దవడుగూరు: లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మంగళవారం రాత్రి బయలుదేరిన ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్‌ప్లాజా సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ఎదురుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో గుత్తి పట్టణానికి చెందిన దశకంఠేశ్వరరెడ్డి, పావని, ప్రవళిక, కర్నూలుకు చెందిన సుహేల్, నఫీస్, ఆత్మకూరుకు చెందిన శరత్, వెంకటేష్, దన్విన్‌తో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అంనతరం అనంతపురం, కర్నూలులోని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.


