సాగులో రైతుకు తోడుగా నిలుద్దాం
ప్రశాంతి నిలయం: రైతులకు సాగులో సాయంగా నిలుద్దామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. 2026–27 సంవత్సరానికి జిల్లాలో సాగు చేయనున్న వివిధ పంటలకు అందించబోయే ఆర్థిక సాయం, పంటల వ్యయ అంచనాలు, రైతులకు అందాల్సిన రుణ పరిమాణం, వడ్డీ భారం తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపేందుకు ఆమోదం తెలిపారు. రైతులకు రుణాలు సకాలంలో అందించాలని బ్యాంకర్లకు సూచించారు.
జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ
సమావేశంలో కలెక్టర్ శ్యాంప్రసాద్


