మహిళా చైతన్యానికి సైకిల్‌యాత్ర
● పర్వతారోహకురాలు, సైకిలిస్ట్
సమీరాఖాన్
అనంతపురం అర్బన్: మహిళ సాధికారత, వరకట్న వేధింపులు, గృహహింసపై దేశ వ్యాప్తంగా మహిళల్లో చైతన్యం కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు అనంతపురానికి చెందిన పర్వతారోహకురాలు, సైకిలిస్ట్ సమీరాఖాన్ తెలిపారు. తన యాత్ర నేపాల్ వరకూ సాగుతుందన్నారు. సైకిల్ యాత్రను కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కింద ఎవరెస్ట్ పర్వతారోహణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోలో సైక్లింగ్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు మహిళ సాధికారతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.ఉదయ్‌భాస్కర్, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రవాణా నివారణకు పోలీస్, ఫారెస్ట్, ఎకై ్సజ్ శాఖలు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్లు చేయాలన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారికి వేసే శిక్షల గురించి అందరికీ తెలిసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే చెడు ప్రభావాలను వివరించాలని ఆదేశించారు. విద్యా సంస్థలు వద్ద కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రహిత జిల్లాగా శ్రీసత్యసాయిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. మాదకద్రవ్యాల రవాణాకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. లారీలు, బస్సులు, రైలు ద్వారా రవాణా చేస్తున్నవారిని అందుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
మహిళా చైతన్యానికి సైకిల్‌యాత్ర


