441 మంది టీచర్లకు షోకాజ్
పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కారు పెద్ద షాక్ ఇచ్చింది. సాయంత్రం పూట ముఖ హాజరు (ఫేషియల్ అటెండెన్స్) సక్రమంగా వేయలేదని జిల్లాలోని 441 మంది టీచర్లకు డీఈఓ కృష్ణప్ప ద్వారా శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇప్పించింది. ఈ నోటీసులపై ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం... ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగిస్తూ, వారిలో ఒత్తిడి పెంచి మానసికంగా కుంగదీస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజ్జల హరి ప్రసాద్‌రెడ్డి, గోపాల్ నాయక్ అన్నారు. వెంటనే షోకాజ్ నోటీసులు ఉప సంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్‌వర్క్ సమస్య వల్ల అటెండెన్స్ వేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని, అలాంటి పరిస్థితుల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను ప్రామాణికంగా తీసుకోవటం అన్యాయమన్నారు.
నోటీసులు ఉపసంహరించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, నీలా ఇంద్ర ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య ఉందని, ఈ కారణంతో చాలా మంది ఫేషియల్ అటెండెన్స్ వేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్య గురించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు చెప్పామన్నారు. అయినా సాంకేతిక సమస్యలు పట్టించుకోకుండా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులివ్వటం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయటమేనన్నారు. షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోక పోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఫేషియల్ అటెండెన్స్ వేయని ఫలితం
సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల నేతల భగ్గు


