సెలవులు వచ్చాయోచ్!
● నేటి నుంచి 18వ తేదీ వరకూ
సంక్రాంతి సెలవులు
● కేరింతలు కొడుతూ ఇళ్లకు
పరుగులు తీసిన చిన్నారులు
పుట్టపర్తి: ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–3 పరీక్షల నేపథ్యంలో వారం రోజులుగా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు శుక్రవారం పరీక్ష ముగియగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇక జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేసే విద్యా సంస్థలకు శనివారం నుంచి 18వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులిచ్చారు. దీంతో చిన్నారులంతా శుక్రవారం పాఠశాల, కళాశాలలు ముగియగానే ఉత్సాహంగా ఇళ్లకు పరుగులు తీశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహాల్లో ఉంటున్న వారంతా శుక్రవారం సాయంత్రం సామగ్రి సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జిల్ల్లాలోని ఆర్టీసీ బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి.
కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్తున్న బత్తలపల్లి మండలం మాల్యవంతం హైస్కూల్ విద్యార్థులు


