క్రీడా వికాసం..సాంస్కృతిక వైభవం
ప్రశాంతినిలయం: క్రీడా వికాసంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని చాటే సత్యసాయి సంస్థల సాంస్కృతిక క్రీడా సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ప్రారంభమై రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియం ముస్తాబైంది. క్రీడా, సాంస్కృతిక సమ్మేళనం కోసం సత్యసాయి విద్యాసంస్థల పరిధిలోని ప్రశాంతినిలయం, అనంతపురం మహిళా క్యాంపస్, బృందావన్, నందగిరి క్యాంపస్‌ల విద్యార్థులు వారం రోజులుగా సాధన చేస్తున్నారు. మార్చ్ ఫాస్ట్, జిమ్నాస్టిక్స్, ఆధునిక సంప్రదాయ నృత్య ప్రదర్శన, చైనీస్ డ్రాగన్ నృత్యం తదితర అంశాలపై కఠోర సాధన చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యార్థుల మార్చ్ ఫాస్ట్‌తో హిల్‌వ్యూ స్టేడియంలో క్రీడా సమ్మేళనం ప్రారంభమవుతుంది. అనంతపురం క్యాంపస్, సత్యసాయి నర్సింగ్ కళాశాల, ప్రశాంతి నిలయం క్యాంపస్, బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ఉంటాయి. సాయంత్రం పుట్టపర్తిలోని ఈశ్వరమ్మ హైస్కూల్, సత్యసాయి హయ్యర్ సెకెండరీ స్కూల్, ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. క్రీడా సమ్మేళనానికి విద్యార్థులు, వారి తల్లితండ్రులు స్థానిక ప్రజలు, పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్టేడియంలో ఏర్పాట్లు చేసింది.
నేడు సత్యసాయి క్రీడా సాంస్కృతిక సమ్మేళనం
సుందరంగా ముస్తాబైన
హిల్‌వ్యూ స్టేడియం
క్రీడా వికాసం..సాంస్కృతిక వైభవం
క్రీడా వికాసం..సాంస్కృతిక వైభవం


