గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్‌డే) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈనెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ సతీష్ కుమార్‌తో వేడుకల నిర్వహణ, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన సన్నాహకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకల్లో పతాకావిష్కరణ, వేదిక ఏర్పాట్లు, అలంకరణ పనులు సుందరంగా చేపట్టాలన్నారు. పరేడ్ మైదానంలో బారికేడ్లు, వైట్ వాష్ తదితర పనులను పూర్తి చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల సభ్యులు, ప్రత్యేక అతిథులను గౌరవ ప్రదంగా ఆహ్వానించాలన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు రూపొందించాలని, ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించేందుకు ప్రతిపాదిత జాబితాను గడువులోపు సమర్పించాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ... జిల్లా యంత్రాంగం సమన్వయంతో పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన అన్ని భద్రతా, పరేడ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు


