హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు.
బేస్‌బాల్ పోటీల్లో
నల్లమాడ విద్యార్థుల సత్తా
● జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు
ఇద్దరి ఎంపిక
నల్లమాడ: బేస్‌బాల్ పోటీల్లో నల్లమాడ విద్యార్థులు సత్తా చాటారు. అండర్–14 జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కుసుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో స్థానిక ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కె. భాస్కర్ నాయక్ (9వ తరగతి), ఎం. లిఖిత్ నాయక్ (8వ తరగతి) జిల్లా జట్టు తరఫున ఆడి సత్తా చాటారు. దీంతో నిర్వాహకులు వారిని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్–14 రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు పాఠశాల హెచ్‌ఎం సతీష్, వసతి గృహ సంక్షేమాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిద్దరూ పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఈనెల 27 నుంచి 31 వరకు జరిగే జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఎంపికై న విద్యార్థులను హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూఓతో పాటు పీడీ ధరణి, పాఠశాల సిబ్బంది అభినందించారు.
సూపర్ స్పెషాలిటీలో
పీడియాట్రిక్ సర్జరీ విభాగం
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చడం జరిగిందన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన
ఐసీడీఎస్ పీడీ
పుట్టపర్తి అర్బన్: సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా (పీడీ)గా తోట శ్రీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని డైరెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఆమెను, ఉన్నతాధికారులు ఇటీవలే జిల్లా ఇన్‌చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చేతన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఇప్పటిదాకా ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీగా పనిచేసిన సుధావరలక్ష్మి తిరిగి ఓడీసీ సీడీపీఓగా పూర్వ స్థానానికి వెళ్లారు.
నిలకడగా చింత పండు ధరలు
నిలకడగా చింత పండు ధరలు
నిలకడగా చింత పండు ధరలు