
ర్యాలీగా వెళుతున్న ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, దుద్దుకుంట అపర్ణారెడ్డి
కొత్తచెరువు: పెద్దమ్మ స్వామి ఆశీస్పులతో రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకోవడం ఖాయమని హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి స్పష్టం చేశారు. కొత్తచెరువులోని ఇసుకవంక వీధిలో వెలసిన పెద్దమ్మ గుడికి శుక్రవారం ఉదయం వారు ఒడిబియ్యం సమర్పించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేత దాల్‌మిల్ సూరి ఆధ్వర్యంలో దాదాపు 5వేల మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. అంతకు ముందు వాల్మీకి, శ్రీకృష్ణదేవరాయులు, అంబేడ్కర్, వడ్డె ఓబన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన అనంతరం వారు మాట్లాడారు. రాష్రంలో పేదలు బాగుపడలన్నా, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. మోసం, నయవంచనకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అన్నారు. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు చేసిన అభివృద్ధి అంటూ ఏదీ లేదన్నారు. ఎన్నికల సమయంలో తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వచ్చే మోసకారి చంద్రబాబును నమ్మబోరాదన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యుగంధర్, వైస్ ఎంపీపీ సరళ, పార్టీ మండల కన్వీనర్ జగన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ గంగాదేవి, మాజీ జెడ్పీటీసీ మహాలక్ష్మి, మాజీ ఎంపీపీ నారాయణ, నాయకులు ఆవుటాల రమణారెడ్డి, ఓడీసీ శ్రీనివాసులురెడ్డి, తలమర్ల శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నారేపల్లి సంజీవరెడ్డి, బైరాపురం జనార్దనరెడ్డి, వెంకట్రాముడు, వాల్మీకి శంకర్, అంగడి సత్తి, వెంకటరాముడు, కవిత, సాయిగీత తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, ఎమ్మెల్యే సతీమణి అపర్ణారెడ్డి
భారీ ర్యాలీతో పెద్దమ్మకు
ఒడి బియ్యం సమర్పణ