
ధర్మవరం: పట్టణంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ధర్మవరంలోని 14వ వార్డుకు చెందిన 90 కుటుంబాలు కౌన్సిలర్ శివ ఆధ్వర్యంలో, 31వ వార్డులో 215 కుటుంబాలు వార్డు ఇన్‌చార్జ్ తోపుదుర్తి వెంకటరాముడు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో నారాయణస్వామి, రామకృష్ణ, మునాఫ్, రాము, వెంకటప్ప, వెంకట లక్ష్మి, బాలగొండ్ల వెంకటరాముడు, పూజారి చౌడయ్య, అంగజాల రామన్న, మల్లెల శ్రీరాములు, రమణ, బంధనాథం శ్రీరాములతో పాటు మొత్తం 305 కుటుంబాల వారున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు కోటిరెడ్డి బాలిరెడ్డి, నీలూరి ప్రకాష్, కౌన్సిలర్లు తోపుదుర్తి రమణమ్మ, నాయకులు పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, కమాటం శేషాద్రిరెడ్డి, శ్రీశైలం అరవింద్‌గౌడ్, బోయ నర్శింహులు, ఉడుముల రాము, వడ్డే శ్రీన, తీర్థాల రమణ , తొండమాల రవి, అమీర్‌బాషా, సల్లప్ప, కత్తె పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో పేదల పక్షాన పోరాడుతున్న జగనన్నకు ప్రజలంతా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేదలకు అందకుండా చేస్తారన్నారు.
ధర్మవరంలోని వివిధ వార్డుల నుంచి 305 కుటుంబాలు చేరిక
కొత్తచెరువు మండలం గోరంట్లపల్లిలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ

14వ వార్డు కౌన్సిలర్ గుజ్జల శివ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన 90 కుటుంబాలు