సిద్దయ్యా..ఇదేందయ్యా | - | Sakshi
Sakshi News home page

సిద్దయ్యా..ఇదేందయ్యా

Jun 10 2023 9:46 AM | Updated on Jun 10 2023 9:48 AM

టీడీపీ నాయకులతో సిద్దయ్య  (వృత్తంలో)  - Sakshi

టీడీపీ నాయకులతో సిద్దయ్య (వృత్తంలో)

శ్రీ సత్యసాయి: శెట్టిపల్లికి చెందిన దూదేకుల సిద్దయ్య మాజీ ఎమ్మెల్యే బీకే. పార్థసారథి ప్రధాన అనుచరుడు. పెనుకొండ టీడీపీ మండల కన్వీనర్‌గా ఉండేవాడు. కర్ణాటక మద్యం తరలిస్తూ అప్పట్లో పోలీసులకు పట్టుబడ్డాడు. రిమాండ్‌కు సైతం వెళ్లి వచ్చాడు. అయితే గతంలోనే బీఎడ్‌ పూర్తి చేసిన సిద్దయ్య 1998 డీఎస్సీలో అర్హత సాధించగా...ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ఇటీవల ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన రొద్దం మండలంలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిన ఆయన... శుక్రవారం పెనుకొండలో జరిగిన ‘భవిష్యత్‌కు టీడీపీ భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో కలిసి ఫొటోలు తీసుకుంటూ సంబరపడిపోయారు. సిద్దయ్య హడావుడి చూసిన టీడీపీ నేతలు ఇతను టీడీపీ సిద్దయ్యా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement