డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

పెనుకొండ రూరల్‌(సోమందేపల్లి): రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను పారదోలాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ కోరారు. ఆదివారం సోమందేపల్లి మేజర్‌ పంచాయతీలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతతో కలసి 2కే రన్‌ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌లో ప్రారంభమైన రన్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, కొత్తపల్లి క్రాస్‌ మీదుగా తిరిగి వైఎస్సార్‌ సర్కిల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు. నియోజకవర్గంలో మంత్రి ఉన్నప్పటికీ గంజాయి సరఫరా అవుతోందని విమర్శించారు. గంజాయికి ఎంతో మంది బానిసలయ్యారంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అసెంబ్లీలో మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌

సోమందేపల్లిలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 2కే రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement