డిజిటలైజేషన్‌ వంద శాతం పూర్తవ్వాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ వంద శాతం పూర్తవ్వాలి

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

మడకశిర/మడకశిర రూరల్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల (ఈఎఫ్‌) డిజిటలైజేషన్‌ను గడువులోపు వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. ఆదివారం మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని 193,194 పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. ఓటర్ల నమోదు, సవరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాల నిర్ధారణ కోసం వారి ఇంటికి బీఎల్‌ఓలు మూడు సార్లు వెళ్లి ఫొటోలు, వాటి ప్రింట్‌లు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు మడకశిర మండలంలోని కల్లుమర్రి సచివాలయంలో ఈఎఫ్‌ డిజిటలైజేషన్‌ను ఆయన పరిశీలించారు. కల్లుమర్రి బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. నోడల్‌ అధికారిణి శోభారాణి, తహసీల్దార్‌ ముకుంద, ఎంపీడీఓ సోనిబాయి పాల్గొన్నారు.

థియేటర్లలో సర్‌ ప్రదర్శనలు

ప్రశాంతనిలయం: ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 14న జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రచార దృశ్యాలు, చిత్రాలు ప్రదర్శించాలని థియేటర్‌ యజమానులు, అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement