రూ.11 కోట్లు హాంఫట్‌! | - | Sakshi
Sakshi News home page

రూ.11 కోట్లు హాంఫట్‌!

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

పుట్టపర్తి: కరువు జిల్లాలో సాధారణ పంటల నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించి బీడు భూములను సాగులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టింది. రైతులను ప్రోత్సహించడానికి ఉచితంగా మొక్కలు ఇవ్వడంతో పాటు నిర్వహణ, నీళ్లు పెట్టడం, కంచె తదితరాలకు ప్రభుత్వం మూడేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించింది. ఇందులో భాగంగా 2018, 2019 సంవత్సరాల్లో మంజూరైన మామిడి మొక్కలకు, నిర్వహణ ఖర్చులకు ఇటీవల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ సొమ్ము ఉద్యాన రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఆరేళ్ల క్రితం సంగతి కావడంతో రైతులు బిల్లుల విషయమే మరచిపోయారు. ఇదే అదనుగా డ్వామా సిబ్బంది, కొంత మంది టీడీపీ నాయకులు కుమ్మకై ్క నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,445 మందికి అందాల్సిన రూ.11 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా మింగి రైతుల నోట్లో మట్టి కొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీజీరాంజీగా మార్చిన సమయంలో ఈ అవినీతి తతంగం బయట పడడం గమనార్హం.

అన్ని మండలాల్లో స్వాహాపర్వం..

పుట్టపర్తి, చిలమత్తూరు, అమడగూరు, ముదిగుబ్బ తదితర మండలాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్లు వారి భార్యల ఖాతాలు, బంధువుల ఖాతాలకు నిధులు మళ్లించారు. పుట్టపర్తి మండలంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యుడిని వెండర్‌గా చూపి రూ. 3 లక్షలు స్వాహా చేశారు. ఆయనను ఏకంగా 77 మంది రైతులకు వెండర్‌గా చూపి నిధులు మళ్లించారు. చిలమత్తూరు మండలంలో రూ.2 లక్షలు, అమడగూరు మండలంలో రూ.3 లక్షలు, ముదిగుబ్బ మండలంలో రూ.5 లక్షలు... ఇలా అన్ని మండలాల్లోనూ స్వాహా పర్వం సాగింది.

మామిడి రైతులకు అందాల్సిన

బిల్లులు పక్కదారి

డ్వామా సిబ్బంది, ‘పచ్చ’ నేతలు

కుమ్మకై ్క మింగేశారనే ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement