రైల్లోంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైల్లోంచి పడి వ్యక్తి మృతి

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

మనుబోలు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని రైల్వేట్రాక్‌పై మనుబోలు, గూడూరు రైల్వేస్టేషన్‌ల మధ్య బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు మండల కేంద్రం సమీపంలోని పంబలేరు రైల్వే వంతెన వద్ద డౌన్‌లైన్‌లో 139/10–12 కిలోమీటర్‌ వద్ద ఓ వ్యక్తి మరణించి ఉండడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని, ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. నలుపు రంగు టీషర్ట్‌, గ్రే కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నారు.

ఈవీ ఆటో బోల్తా

● వ్యక్తికి తీవ్రగాయాలు

వరికుంటపాడు: ఈవీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన వరికుంటపాడు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా పామూరుకు చెందిన రవి తన ఈవీ ఆటోలో బాడుగ నిమిత్తం జడదేవికి వచ్చి తిరిగి పామూరుకు వెళ్తుండగా కనియంపాడు రోడ్డు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీస్‌ కేసు నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement