● కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన మనుబోలు సర్పంచ్ అభ్యర్థి బొమ్మిరెడ్డి ఉమామహేశ్వరి నివాసంలో స్థానిక నాయకులతో బుధవారం సమావేశమై ఎన్నికల ప్రచారం, కౌంటింగ్ ప్రక్రియలపై నాయకులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నరేళ్లలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకునేందుకు స్థానిక ఎన్నికల్లో రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజల అండతో వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, పార్థేశ్వరరెడ్డి, ముంగర రవీంధర్‌రెడ్డి, సూరపనేని కిశోర్‌నాయుడు, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, బొమ్మిరెడ్డి మహేష్, కంచి మణి, కమలాకర్‌రెడ్డి, కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్, గిరి, దయాకర్, నవకోటి తదితరులున్నారు.


