బియ్యం వ్యాపారానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బియ్యం వ్యాపారానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Nov 26 2026 12:24 AM | Updated on Nov 26 2026 12:24 AM

● జేసీ వెంకటేశ్వర్లు

నెల్లూరురూరల్‌: బియ్యం విక్రయించే హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులందరూ తప్పనిసరిగా జిల్లా పౌర సరఫరాల శాఖ నుంచి రిజిస్ట్రేషన్‌ పొందాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బియ్యం రకాల వారీగా గరిష్ట ధరలను నిర్ణయించిందని తెలిపారు. వ్యాపారులందరూ ప్రభుత్వ పోర్టల్లో తమ దుకాణాల వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఫుడ్‌ స్టాక్‌ పోర్టల్లో కూడా తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలో సుమారు 750 మంది బియ్యం వ్యాపారులు ఉన్నారని, ప్రభుత్వం నిర్ణయించిన నిల్వల పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. రైస్‌ మిల్లర్లు 400 టన్నులు, జిల్లా కేంద్రంలోని హోల్‌సేల్‌ వ్యాపారులు 500 క్వింటాళ్లు, గ్రామీణ ప్రాంతాల హోల్‌సేల్‌ వ్యాపారులు 250 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారులు 50 క్వింటాళ్లకు మించి నిల్వలు ఉంచరాదన్నారు. మిల్లర్లు, వ్యాపారులు రోజువారీ కొనుగోలు వివరాలను సాయంత్రం పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు నిల్వలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. బ్రాండ్‌ పేరుతో నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రతి దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement