వీఆర్సీ సెంటర్లో కమ్ముకున్న కారు మేఘాలు
కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద పొంగిపొర్లుతున్న వర్షపునీరు
నగరంలో జోరుగా కురుస్తున్న వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కురుస్తోంది. విడతల వారీగా బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. రోజంతా ఆకాశం మేఘావృతం కావడంతో పాటు చలి గాలులకు వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోయారు. కాగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు
నిలిచింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


