విద్యుత్‌ సిబ్బందికి సెలవులు రద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సిబ్బందికి సెలవులు రద్దు

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

● అన్ని డివిజన్లలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుడంగా మారి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశమున్న తరుణంలో విద్యుత్‌ శాఖ సిబ్బందికి సెలవులను రద్దు చేశామని ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ సుధాకర్‌ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌ నుంచి ఈఈలు, డీఈఈలతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సిబ్బంది తమకు నిర్దేశించిన హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని ఆరు డివిజన్లతో పాటు విద్యుత్‌ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలూ పనిచేయనున్నాయని వెల్లడించారు. ముందస్తు చర్య ల్లో భాగంగా అదనపు స్తంభాలను అందుబాటులో ఉంచాలని, సబ్‌స్టేషన్లలో ఇద్దరు చొప్పున సిబ్బందిని ఉంచి, మిగిలిన వారిని అత్యవసర సేవలకు ఉపయోగించుకోవాలని సూచించారు. లైన్లు తెగిపడినా, స్తంభాలు పడిపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండి సంబంధిత విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement