అండగా ఉంటాం.. ఆదరించండి | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. ఆదరించండి

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు(బృందావనం): స్థానిక వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా అండగా ఉంటామని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. నెల్లూరు మండపాల వీధిలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి, కార్పొరేటర్‌ అభ్యర్థులు వేలూరు ఉమామహేష్‌, చీదెళ్ల కిషన్‌లతో కలిసి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత జైన్‌ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల వీధి, కాపువీధి తదితర ప్రాంతాల్లోని పలు వాణిజ్య దుకాణాలకు వెళ్లి పార్టీ కరపత్రాలను పంపిణీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. నవంబర్‌ ఒకటో తేదీన జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని, 61వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా వేలూరు ఉమమహేష్‌ను, 59వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా చీదెళ్ల కిషన్‌ను గెలిపించాలన్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోందన్నారు.

దశాబ్దాల అనుబంధం మనది

మండపాల వీధి, కాపువీధి, ఆచారివీధి ప్రాంతాలకు చెందిన వారితో దశాబ్దాల అనుబంధాలున్నాయని మేయర్‌ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన స్థానికులను పేరుపేరునా పలుకరిస్తూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement