విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

నెల్లూరు (టౌన్‌): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గనిరాజు డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ నెల్లూరు నగర 17వ మహాసభలను పురస్కరించుకొని నగరంలోని వీఆర్సీ సెంటర్‌ నుంచి సర్వోదయ కళాశాల వరకు గురువారం నిర్వహించిన మహా ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంతో పాటు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.6450 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. సీపీఐ ఎమ్మెల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోలయ్య, పీడీఎస్‌ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి షారూఖ్‌, అరుణోద య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను, రాష్ట్ర నేతలు ర జియా, నాగలక్ష్మి, నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, సంతోష్‌, యశ్వంత్‌, విష్ణు, బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement