నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు చిన్న మాలకొండయ్య డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలోని ఏసీనగర్ సెంటర్‌లో గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వీరు మాట్లాడారు. కార్మికుల ఇబ్బందులను పట్టించుకోకుండా అభివృద్ధి అని చెప్పడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. వీటిపై దృష్టి సారించకపోతే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని స్పష్టం చేశారు. నేతలు మట్టిపాటి శ్రీనివాసులు, కామాక్షమ్మ, అశోక్, లోకేష్, రావమ్మ, దయామణి, శ్రీనివాసులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


