జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి | - | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

నెల్లూరురూరల్‌: తాడేపల్లిలోని నివాసంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి గ్రామోత్సవం

చిట్టమూరు: మండలంలోని మల్లాంలో జరుగుతున్న వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలాభిషేకం, నందిసేవ, రాత్రి మల్లాసుర, కొల్లాసుర యుద్ధం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కసురుపై సముద్రం

చిల్లకూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో మండలంలోని తీరప్రాంతంలో సముద్రం కసురు మీద ఉంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని పెనుగాలులు వీస్తూ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో గుమ్మళ్లదిబ్బ, మిద్దెరేవు, తీగపాళెం గ్రామాల మత్స్యకారులు వేటను నిలిపివేసి తమ పడవలను, వలలను సురక్షిత ప్రాంతంలో భద్రపరుచుకున్నారు.

సిలికా మైనింగ్‌కు

ప్రజాభిప్రాయ సేకరణ

చిల్లకూరు: మండలంలోని మోమిడిలో సిలికా మైనింగ్‌కు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను రెవెన్యూ, పర్యావరణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు.తొలుత జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోమిడిలోని సర్వే నంబర్‌ 696లోని సుమారు 8.693 హెక్టార్లలో సిలికా తవ్వకాల కోసం సప్తగిరి మినరల్‌ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని తెలిపారు. అందుకు సంబంధించి ప్రజాబిప్రాయ సేకరణ చేపడుతున్నామని చెప్పారు. స్థానికులు, ఎన్‌జీఓ అభిప్రాయాలను ఆడియో, వీడియోల రూపంలో రికార్డు చేసి కేంద్ర పర్యావరణ శాఖ అధికారులకు అందజేస్తామని తెలిపారు. అనంతరం స్థానికులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ సిలికా తవ్వకాలకు కేటాయిస్తున్న భూమి రిజర్వు ఫారెస్ట్‌ కాగా, దానిని రికార్డుల్లో జంగిల్‌ పోరంబోకుగా మార్చి సిలికా తవ్వకాలకు దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. సిలికా తవ్వకాలకు అనుమతులు ఇస్తే రిజర్వు ఫారెస్ట్‌ పూర్తిగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవాలు, పశువులను ఎక్కడ మేపుకోవాలని ప్ర శ్నించారు. గతంలో కొందరు సిలికా తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని కోర్టును ఆశ్రయించి ఉన్నారని తెలిపారు. ఇటీవల గూడూరుకు చెందిన నానుమునీంద్రరెడ్డి కోర్టుకు వెళ్లగా కలెక్టర్‌ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అయినా అధికారులు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టడం చూస్తుంటే పెద్దలే మైనింగ్‌కు అప్పగించేలా వ్యవహరిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గూడూరు ఆర్డీఓ అరుణకుమారి, తహసీల్దార్‌ గోపినాథ్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement