దళిత యువకుడిపై అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

దళిత యువకుడిపై అక్రమ కేసులు

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

● చెర్లోపల్లిలో దళితుల ఆందోళన

మనుబోలు: మండలంలోని చెర్లోపల్లికి చెందిన దళిత యువకుడు అభిషేక్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించడంపై పలువురు దళితులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తలారి దేవదానం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొందరు మద్యం సేవించి ఇంటిపైకి గొడవకు వచ్చి దళిత యువకుడిని కొట్టారని ఆరోపించారు. అప్పట్లో బాధితులు కేసు పెట్టగా కొట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించారని తెలిపారు. అప్పుడు శిక్ష పడిన వారు కొంత కాలం కనిపించకుండా పోయి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతీకారానికి తెరలేపారన్నారు. అందులో భాగంగా దళిత యువకుడిపై తప్పుడు కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరిచి మూడు నెలలు జైలుకు పంపారని తెలిపారు. ఇటీవల శిక్ష అనుభవించి బయటకు రాగా మళ్లీ గంటల వ్యవధిలోనే పీడీ యాక్ట్‌ కింద పోలీసులు అరెస్ట్‌ చేశారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం దుర్మార్గమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అభిషేక్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేదంటే దళిత సంఘాలను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement