చెత్తపై బహిరంగ చర్చకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

చెత్తపై బహిరంగ చర్చకు సిద్ధమా?

Sep 24 2026 2:24 AM | Updated on Sep 24 2026 2:24 AM

మంత్రి నారాయణకు

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సవాల్‌

నెల్లూరురూరల్‌: చెత్త తొలగింపు అంశంపై మంత్రి నారాయణ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఖండించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి నారాయణ రెండున్నరేళ్లుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 83 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంలో వదిలివెళ్లిందని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం 1.63 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని పేర్కొంటున్నారని అన్నారు. చెత్త తొలగింపు పేరుతో సుమారు రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని తాను ఆరోపిస్తున్నానని తెలిపారు. నెల్లూరు నగరంలో పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన నిధులను సంబంధిత వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపై వాస్తవాలను ఆధారాలతో సహా వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే మంత్రి నారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని పర్వతరెడ్డి తెలిపారు. అదే సమయంలో తన ఆరోపణలు నిజమని నిరూపితమైతే మంత్రి నారాయణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. తాను చెప్పిన అంశాలపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, మంత్రి నారాయణ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. చర్చకు రాకపోయినా సంబంధిత వాస్తవ ఆధారాలను త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందుంచుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement