న్యాయమూర్తుల నియామకం | - | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తుల నియామకం

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

నెల్లూరు (లీగల్‌): జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికైన పలువురు న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. నెల్లూరుకు చెందిన పెళ్లకూరు చెంచుకృష్ణ ప్రియాంక దేవిని కడప స్పెషల్‌ ఎకై ్సజ్‌ కోర్టుకు.. పొట్లూరి రిషికిరణ్‌ను చిత్తూరు మొదటి తరగతి రెండో అదనపు జ్యుడీషియల్‌ కోర్టుకు.. దామరమడుగు దివ్యశ్రీని తిరుపతి మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టుకు, బడుగు సిరి విశ్వజ హింద్‌ను జగ్గయ్యపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు.. కావలికి చెందిన దర్శి వెంకటసత్య ధనుష్‌ను చీరాల మొదటి తరగతి రెండో అదనపు జ్యుడీషియల్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు.

● ఒంగోలుకు చెందిన నల్లూరి గౌతమిని నెల్లూరు స్పెషల్‌ ఎకై ్సజ్‌ కోర్టుకు, దర్శికి చెందిన ధర్మవరపు మృదులను గూడూరు మొదటి తరగతి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన కిషోర్‌ భూషణను కోట మొదటి తరగతి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు.. హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన దళవాయి యజ్ఞశ్రీని సూళ్లూరుపేట మొదటి తరగతి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమించారు.

● కోవూరు మొదటి తరగతి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శివ నమ్రతను కోవూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఈ స్థానంలో హైదరాబాద్‌కు చెందిన శ్రావణిరెడ్డిని నియమించారు.

దివ్యశ్రీ

ప్రియాంకదేవి

సిరి విశ్వజ హింద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement