డీపీఎం, ఏపీఎంలకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డీపీఎం, ఏపీఎంలకు శిక్షణ

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలు మొబైల్‌ యాప్‌ ద్వారా నగదును సురక్షితంగా ట్రాన్స్‌ఫర్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని అక్షరాంధ్ర డిప్యూటీ డైరెక్టర్‌ మస్తాన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్షరాంధ్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా 94 వేల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని వివరించారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు బ్యాంకుల్లో నగదు జమ, డ్రా చేయడం తదితర అంశాలపై అవగాహనను పెంచుకోవాలని కోరారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement