సఫాయి కర్మచారీల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సఫాయి కర్మచారీల సంక్షేమానికి ప్రాధాన్యం

Sep 20 2026 12:27 AM | Updated on Sep 20 2026 12:27 AM

నెల్లూరు రూరల్‌: సఫాయి కర్మచారీల ఆరోగ్య భద్రత, సంక్షేమానికి అధికారులు ప్రాధాన్యమివ్వాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. మాన్యువల్‌ స్కావెంజర్స్‌ యాక్ట్‌పై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలను మున్సిపాల్టీల్లో పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. కార్మికుల సమస్యలను కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టనున్నామని వివరించారు. సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement