క్లుప్తంగా
ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ ఏర్పాటు
నెల్లూరు(టౌన్): ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరులోని చిన్నబజారులో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవాధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్, అధ్యక్షుడిగా షేక్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ తమీమ్ అన్సారీ, ఆర్థిక కార్యదర్శిగా పఠాన్ అబ్దుల్ మునాఫ్, అసోసియేట్ అధ్యక్షులుగా ఖాజా నవాజ్, జిలానీబాషా, మహమ్మద్ ఇనాయత్, కరిముల్లా, ఉపాధ్యక్షులుగా జమీర్, దావూద్, షౌకత్ అలీ, అదనపు ప్రధాన కార్యదర్శులుగా అహ్మద్, షబ్బీర్, షంషాద్ బేగం, కార్యదర్శులుగా ఖాజా హుస్సేన్, నిషాద్‌బేగం, నాయబ్ జానీ వ్యవహరించనున్నారు.
వీఎస్‌యూలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్–2 అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ (డీఓఏ) డైరెక్టర్ హనుమారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన, 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుందని తెలిపారు. 27న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులు 28 నుంచి 30వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
ఐసెట్ తుది విడత ప్రవేశాలు
యూనివర్సిటీ పరిధిలోని కాకుటూరు, కావలి కళాశాలల్లో ఐసెట్ – 26 ద్వారా ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత షెడ్యూల్ విడుదలైనట్లు హనుమారెడ్డి తెలిపారు. ఈనెల 21, 22 తేదీల్లో ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన, ఫీజుల చెల్లింపు ప్రక్రియ ఉంటుందన్నారు. 21 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 26న సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన విద్యార్థులు 28 నుంచి 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ జాయినింగ్ పూర్తి చేసి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రసూల్
తమీమ్ అన్సారీ
అబ్దుల్ మునాఫ్
పెద్దవి : రూ.160
సన్నవి : రూ.110
పండ్లు : రూ.50


