● వ్యక్తి మృతి
వాకాడు: మండల కేంద్రమైన వాకాడుకు చెందిన మామిడిపూడి కస్తూరయ్య (50) స్వర్ణముఖి నదిలో పడి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. దళితవాడకు చెందిన కస్తూరయ్య గురువారం సాయంత్రం బహిర్భూమి కోసం నది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిగుంటలో పడిపోయాడు. కస్తూరయ్య నది వద్దకు వెళ్లిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఎటైనా వెళ్లి ఉంటాడని భావించి అర్ధరాత్రి వరకు ఎదురుచూశారు. శుక్రవారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు నీటిలో మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య వజ్రమ్మ, ఇద్దరు పిల్లలున్నారు.


