రాపూరు: పెంచలకోనలో వెలసిన ఆదిలక్ష్మీదేవికి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆదిలక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని పద్మపీఠంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో వరలక్ష్మిగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి నందనవనానికి తీసుకొచ్చారు. మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలను ఉభయకర్తలు సీతారామయ్యస్వామి, రాజ్యలక్ష్మి అందజేశారు. వ్రతానికి పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు.


