సింహపురిలో డేంజర్‌ బెల్స్‌ | - | Sakshi
Sakshi News home page

సింహపురిలో డేంజర్‌ బెల్స్‌

Aug 22 2026 1:41 AM | Updated on Aug 22 2026 1:41 AM

జిల్లాలో అదుపు తప్పుతున్న

శాంతిభద్రతలు

వరుస హత్యలు, హత్యాయత్నాల

ఘటనలతో కలకలం

మత్తులో నేరాలు

నెల్లూరు(క్రైమ్‌): కూటమి ప్రభుత్వంలో జిల్లాలో శాంతిభద్రతలు అదుపుతప్పి సింహపురి కాస్తా నేరపురిగా మారింది. పాతకక్షలు, ప్రతీకారదాడులు, వివాహేతర సంబంధాలు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలతో నేరాలు పెరుగుతున్నాయి. వరుస హత్యలు, హత్యాయత్నాలతో సింహపురి నెత్తురోడుతోంది. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని పోలీసులు చెబుతున్నప్పటికీ తరచూ చోటుచేసుకుంటున్న నేర ఘటనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

కత్తులు చేతపట్టి..

మునుపెన్నుడూలేని విధంగా కత్తుల సంస్కృతి పెరుగుతోంది. కొందరు యువకులు కత్తులు చేతబట్టి రోడ్లపై సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బెదిరించి అందినకాడికి దోచుకోవడం, చిన్నపాటి వివాదాలకే దాడులకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న వివాదాలు సైతం తీవ్ర ఘర్షణలకు దారితీస్తున్నాయి. అలాగే జిల్లాలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం అందుబాటులో ఉంటోంది. కొందరు యువత మత్తులో మునిగితేలుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రధాన కూడళ్లు, మద్యం దుకాణాల పరిసరాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం మత్తులో హత్యలకు వెనుకాడటం లేదు. అధిక శాతం నేరాలు మద్యం, ఇతర మత్తు పదార్థాల ప్రభావంలోనే జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇలా చేసినా..

పోలీసులు రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు తీరుమారని వారిపై పీడీ యాక్ట్‌లు, పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లు నమోదు చేస్తున్నారు. డ్రోన్‌ నిఘా, విజిబుల్‌ పోలీసింగ్‌, కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. అయినా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసు అధికారులు నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కొన్ని ఘటనలు

మేకపిల్లల పెంపకం విషయంలో నెలకొన్న వివాదంలో కావలి మండలానికి చెందిన వాసు హత్యకు గురయ్యాడు.

ఆర్థిక లావాదేవీల విషయంలో నెలకొన్న వివాదంలో వింజమూరు మండలానికి చెందిన గోవిందులు హత్య జరిగింది.

ముత్తుకూరు మండలంలో రొయ్యల గుంత వద్ద కాపలాగా ఉన్న శేషయ్యను కొందరు చంపారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన ఓ మహిళను స్నేహితుడు కిరాతకంగా హత్య చేశాడు.

గూడూరు మండలం విందూరులో షాహుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

తాజాగా ములుముడికి చెందిన జహంగీర్‌ రోహిత్‌ను స్నేహితుడు మౌలాలి, మరికొందరు కిరాతకంగా చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement